BREAKING
నగరం మండలంలో 33 మంది ఎంపీటీసీలు పోటీ *తుఫాను వేళ .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *మధిర మున్సిపల్ కమిషనర్ కె.శామ్యూల్ పాల్** డాక్టర్ వృత్తిని వదిలి నటిగా ఎందుకు మారారు.. సాయిపల్లవిపై రణ్‌బీర్ కపూర్ అదిరిపోయే కౌంటర్ బాపట్ల జిల్లా బీచ్ లు తాత్కాలికంగా మూసివేత - అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్ సీట్లు సర్దుబాటులో సమన్వయం ఏది కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు చిన్నగంజాం మండలంలో పోలీంగ్‌ బూత్‌లు పరిశీలన పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే 57వ డివిజన్‌లో షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారం.. భారీ ర్యాలీ రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు నెర్రలు బారిన పొలాలు.. రైతన్న కన్నీళ్లు! 31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత.

పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవం

Select Suryaa Now
పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవం

కైకలూరు: మేజర్ న్యూస్, జనసేన పార్టీ తరఫున కైకలూరు ఎంపీపీ అభ్యర్థిగా బూరుబోయిన పద్మాదేవిని నిలబెట్టే లక్ష్యంతో ఆమె భర్త బూరుబోయిన శ్రీనివాసరావు (బి.ఎస్.ఆర్.) తన ఎంపీటీసీ నామినేషన్‌ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పందిరిపల్లిగూడెం గ్రామ ప్రజలు తన భార్య పద్మాదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని హామీ ఇచ్చారని బి.ఎస్.ఆర్. తెలిపారు. ఆ గ్రామంలో ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో పద్మాదేవి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారని వివరించారు.అయితే, పందిరిపల్లిగూడెం నుంచి తన భార్యకు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం లేకపోవడంతో, తాను చటాకాయ్ గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. స్క్రూటినీ ప్రక్రియలో తన నామినేషన్ ఆమోదం పొందిందని, అనంతరం తన భార్యకు జనసేన పార్టీ బీ-ఫారం లభించడంతో చటాకాయ్ నుంచి దాఖలు చేసిన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుని, ఆమెను ఎంపీపీగా నిలబెట్టేందుకు సహకరించాలని కొల్లేరు ప్రాంత ప్రజలకు  విజ్ఞప్తి చేశారు. తన భార్యకు మద్దతుగా నిలుస్తున్న గ్రామ ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి) పాల్గొన్నారు.