BREAKING
నగరం మండలంలో 33 మంది ఎంపీటీసీలు పోటీ *తుఫాను వేళ .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *మధిర మున్సిపల్ కమిషనర్ కె.శామ్యూల్ పాల్** డాక్టర్ వృత్తిని వదిలి నటిగా ఎందుకు మారారు.. సాయిపల్లవిపై రణ్‌బీర్ కపూర్ అదిరిపోయే కౌంటర్ బాపట్ల జిల్లా బీచ్ లు తాత్కాలికంగా మూసివేత - అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్ సీట్లు సర్దుబాటులో సమన్వయం ఏది కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు చిన్నగంజాం మండలంలో పోలీంగ్‌ బూత్‌లు పరిశీలన పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే 57వ డివిజన్‌లో షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారం.. భారీ ర్యాలీ రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు నెర్రలు బారిన పొలాలు.. రైతన్న కన్నీళ్లు! 31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత.

15వ రోజుకు చేరుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె - ఉద్యోగులను ఆదుకోవాలని మంత్రి సీతక్కకు వినతి

Select Suryaa Now
15వ రోజుకు చేరుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె - ఉద్యోగులను ఆదుకోవాలని మంత్రి సీతక్కకు వినతి
 
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 15 రోజులకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఉద్యోగులంతా వినూత్న పద్ధతిలో నిరసన చేపట్టారు. నిత్యవసర ధరలు పెరిగిపోతున్నాయని, ఏం కొనలేని, తినలేని పరిస్థితులున్నాయని, చాలీ చాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నామని గంజి నీళ్లు తాగుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ బాధలను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు.అనంతరం గత 15 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి విన్నవించారు. పక్షం రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదని, ఆయనకు తమ డిమాండ్ల విషయాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరిగా సమ్మె శిబిరాన్ని సందర్శించి న్యాయపరమైన డిమాండ్లకు తనవంతు సంఘీభావం ప్రకటిస్తానన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల చొరవ తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్‌ను ఎన్ హెచ్ ఎం టీజేసి నాయకులు గర్గుల్ రోడ్ వద్ద కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 15 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టామని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో మాట్లాడాలని వేడుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య ఆరోగ్య సేవలందించామని ఆయనకు ఉద్యోగులు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో ఎన్ హెచ్ ఎం  ఉద్యోగుల సమస్యలపై తప్పనిసరిగా మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలపై విన్నవించారు. గత 20 ఏళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమ సమస్యల సాధన కోసం చర్చలు జరపాలని అందుకు తమరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆమెను కోరారు. సీఎం , హెల్త్ మినిష్టర్ లతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపుతామని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో NHM JAC జిల్లా జనరల్ సెక్రటరీ పద్మజ, జాక్ నాయకులు డా.రాజశేఖర్, డా. రవళి, డా.రాహుల్, డా.వేణు మాధవ్, వెంకట రమణ, డా.హరీష్, డా.మౌనిక, శోభారాణి, నిర్మలా, సందీప్, శివ, మంజుల, శ్యామల, బాలు,వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.