BREAKING
ప్రతి ఏటా శారీరక, మానసిక హింసకు గురవుతున్న 100 కోట్ల మంది పిల్లలు విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆత్రేయపురం మండలం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాస్ పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవం అభిషేక్ శర్మ వీరంగం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం! *రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీనిధి విద్యార్థుల ఎంపిక* జనాభా గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెంకన్న సన్నిధిలో ఎలక్షన్ జిల్లా అధికారి ప్రశాంతి ప్రత్యేక పూజలు విరువూరులో వైసీపీ ప్రచార హోరు కాకాణి నాయకత్వంలో విజయమే లక్ష్యంగా ముందుకు.. వాతావరణ మార్పుల నిధులకు నిధుల కొరత లేదు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో సాంకేతిక అస్థిరత ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన 15వ రోజుకు చేరుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె - ఉద్యోగులను ఆదుకోవాలని మంత్రి సీతక్కకు వినతి

మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి

Select Suryaa Now
మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి
రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం నాడు రాయచోటికి విచ్చేసిన  జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన బోనమల ఖాదరవలిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాయచోటి మున్సిపాలిటీలో కూటమి 44 వార్డులకు 44 స్థానాలను ఏకగ్రీవంగా సాధించడం విశేషమన్నారు.  ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  మార్గదర్శకత్వంలో రాయచోటి పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.