BREAKING
బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ. బాలీవుడ్ దీపావళి వేడుకల షెడ్యూల్ ఖరారు.. భద్రతా కారణాల రీత్యా కఠిన నిబంధనలు! ప్రేమ్ నగర్ పాఠశాలను వెంటనే పునః ప్రారంభించాలి-విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయుడు లేక మూత... ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు. నాయికగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ నటి.. అమల్ నీరద్ బాచ్‌లర్ పార్టీ డ్యూక్స్ చిత్ర పోస్టర్ విడుదల నటి దేవయాని ఇంట మరో సంతోషం.. హీరోయిన్‌గా అడుగుపెడుతున్న కూతురు ప్రియాంక రాజకుమారన్! వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం....లబ్బి.! *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి* ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. డబిల్‌పూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ తెరుచుకోని 'స్వర్ణ'.. వెనుతిరుగుతున్న జనం! అజేష్ గెలిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్ర అభివృద్ధి.. సినీనటుడు, బీజేపీ నేత సాయికుమార్ పిలుపు తుఫాన్ ప్రభావం పై జిల్లా లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ వినోద్ కుమార్ వి ఆ రెండు చిత్రాల మాదిరిగానే 'సీన్' కూడా సంచలనం సృష్టిస్తుంది: స్టార్ హీరో సూర్య ధీమా!

గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - టి ఎస్ యు టి ఎఫ్

Select Suryaa Now
గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - టి ఎస్ యు టి ఎఫ్
సూర్య,కాగజ్‌నగర్:  తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్‌) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్‌నగర్‌లోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో  ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, అతిథి ఉపాధ్యాయులకు కనీస వేతన స్కేలు అమలు చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. గురుకుల ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు అందించాలని, మైనారిటీ గురుకులాల్లో ఉపాధ్యాయులపై అడ్మిషన్ల ఒత్తిడిని తగ్గించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు, పీఆర్సీని వెంటనే మంజూరు చేయడంతో పాటు పెండింగ్ బకాయిలను చెల్లించాలన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో కేర్‌టేకర్లను నియమించి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని సూచించారు. ప్రతి గురుకులానికి ఇద్దరు ఆరోగ్య అధికారులను నియమించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జె. మహిపాల్, కాగజ్‌నగర్ మండల ప్రధాన కార్యదర్శి పి. మహేష్ పాల్గొన్నారు.