డబిల్‌పూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్
మేడ్చల్, మేజర్ న్యూస్: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని కొన్నాయిపల్లి గ్రామంలో డబిల్‌పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపని వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు, ఎల్లంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, కోరుపర్తి సత్తయ్య, గుంటి కుమార్, భూపాల్, సల్ల వెంకటేష్, స్థానిక కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్, నిషిత రెడ్డి, దొడ్డు కుమార్, నాయకులు సంజీవ, తలారి నందు, చిన్నోళ్ల సంజీవ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.