BREAKING
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కోసం మెటా భారీ స్టాక్ ఆఫరింగ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ. కొడవలూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక వైసీపీ నాయకులు వాల్మీకి జయంతి వేడుకల్లో డిఎన్ మూర్తి లండన్ లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ వీధిలో బస్సులు, వాహనాల రాకపోకలపై నిషేధం స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...! ఆరోగ్య నెల్లూరే లక్ష్యం.. డివిజన్ల వారీగా పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టుల బహుకరణ.. కళాకారులను ఆదుకోవాలి - తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో రోడ్ల నుంచి పాఠశాలల వరకు.. అభివృద్ధే మా అజెండా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కల్లూరు అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. 37, 38, 39వ వార్డుల్లో కాటసాని విస్తృత ప్రచారం. దూసుకుపోతున్న వైసిపి ప్రచారం! పోలాండ్-జర్మనీ అంతరిక్ష సహకారం..భద్రత, సాంకేతికతపై ప్రత్యేక దృష్టి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల రోడ్ షో

వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం....లబ్బి.!

Select Suryaa Now
వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం....లబ్బి.!

వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం....లబ్బి.!
- భక్తిశ్రద్ధలతో  వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..!
- వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసిన గుజ్జుల

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: వాల్మీకి మహర్షి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని అడుగుజాడల్లో నడుద్దామని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జుల గౌరీశ్వర నాయుడు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా  మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి,  వైష్ణవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రవీంద్రబాబు, శేఖర్, పిక్కిలి వెంకటేశ్వర్లు, మండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి కేవలం ఒక మహాకవి మాత్రమే కాకుండా, ప్రపంచానికి ధర్మం, సత్యం, నీతి, మానవతా విలువల గొప్పతనాన్ని చాటిచెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన రచించిన రామాయణ మహాకావ్యం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తూ, మానవ జీవన విధానానికి విలువైన సందేశాన్ని అందిస్తోందని తెలిపారు. మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంతోపాటు విద్య, సామాజిక అభివృద్ధి, ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ఆయన బోధించిన ఆదర్శాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని ఆకాంక్షించారు. మహర్షి వాల్మీకి ఆశయాల స్ఫూర్తితో సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.