BREAKING
ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్ల దందా!? ఏమి గుండెరా అది రిజ్వాన్..! పదవులు కాదు.. హోదాలు కాదు.. పార్టీ గెలుపే పరమావధి! ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిశంబరు 4-6 తేదీల్లో తిరుపతిలో డిజిపిలు,ఐజిపిల సమావేశం-ప్రధాని,హోంమంత్రి హాజరు జీవనధార ఫౌండేషన్ సేవా కార్యక్రమం ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి - ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలి : సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి .టి.విజయ్ కుమార్ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హైమావతి అహన్ పాండే కొత్త చిత్రానికి బెపర్‌వాహ్‌ టైటిల్ ఖరారు.. విడుదల తేదీ ప్రకటన! కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం... గుజ్జుల..! వెల్దుర్తిలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ. బాలీవుడ్ దీపావళి వేడుకల షెడ్యూల్ ఖరారు.. భద్రతా కారణాల రీత్యా కఠిన నిబంధనలు!

తుఫాన్ ప్రభావం పై జిల్లా లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ వినోద్ కుమార్ వి

Select Suryaa Now
తుఫాన్ ప్రభావం పై జిల్లా లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ వినోద్ కుమార్ వి

బాపట్ల మేజర్‌న్యూస్‌ : 

బాపట్ల  జిల్లాలో  తుఫాన్  ప్రభావంతో ఒక్క ప్రాణ  నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని న్యూ వి సి హల్ నందు  జిల్లాలో రాబోవు తుఫాను వల్ల జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవలసిన చర్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు, ప్రధాన కార్యదర్శులతో  రాష్ట్రంలో తీవ్రమైన తుఫాను రానున్న సందర్భంగా యంత్రాంగం తీసుకోవలసిన చర్యలపై  జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో తీర ప్రాంతమైన బీచ్ ల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను మరియు కృష్ణా నది తీరాన ఉన్న గ్రామాలు, కేనాల్ సమీపంలో ఉన్న ముంపు గ్రామ ప్రజలను అప్రమత్తంగా చేయాలని  ఆర్డీఓలను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి చాపల వేటకు వెళ్లకుండా ముందుగానే వారికి తెలియజేయాలని, ఇప్పటికే సముద్రంలోనికి వెళ్లిన మత్స్యకారులను తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,మత్స్యకారుల కు సంబంధించి బోట్స్ ను పరిశీలించి,గజ ఇతగాళ్లను అందుబాటులో  పెట్టాలని మత్స్య శాఖ డి డి ని ఆదేశించారు. గ్రామ సచివాలయ పరిధిలో పునరావసకేంద్రం ఏర్పాటు చేయడానికి,  స్వయం సహాయక సంఘాల మహిళలు భోజనాలు చేయడానికి తగిన మహిళలను సంబంధిత అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎఫ్ పి షాపు లలో ఉన్న నిత్యావసర వస్తువులు తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అన్ని ఎఫ్ పి షొప్ లలో తగిన నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉండాలని డి ఎస్ ఓ ను ఆదేశించారు.  త్రాగునీరుకు సంబంధించి వాటర్ బాటిల్స్ వాటర్ పాకెట్స్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుఫాను వల్ల  విద్యుత్ కు అంతరాయం కలిగిన వెంటనే మరమ్మతులు చేయడానికి విద్యుత్ పోల్స్, వైర్లు తగిన సిబ్బంది అందరిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్ ఈ ని ఆదేశించారు.  జిల్లాలోనే చెరువుల నుండి నీటిని తొలగించడానికి జెసిబి లు సిద్ధంగా ఉంచుకోవాలని డ్రైన్ ఈ ఈని ఆదేశించారు. అవసరం మేరకు లారీలు, ట్రాక్టర్లు, జీప్ లు,కార్లు,సిద్ధంగా ఉండేలా చర్యలుతీసుకోవాలని డి టి సి ని ఆదేశించారు. స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని, స్కూల్స్ నందు టీచర్లు అందుబాటులో ఉండాలని డి ఈ ఓ ను ఆదేశించారు. వసతి గృహాలలోని పిల్లలను వారి ఇండ్లకు పంపించని సంబంధిత అధికారులను ఆదేశించారు.  జిల్లాలో గర్భవతులను గుర్తించి, అతి తోరలో ప్రసవం అయ్యే మహిళలను సురక్షమైన ఆసుపత్రులకు పంపించాలని, సిహెచ్ సి లు జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని డి యం & హెచ్ ఓ ను ఆదేశించారు. పంట పొలాలలో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారిణి ఆదేశించారు. పూరి గుడిసెలలో ఉన్న వారిని గుర్తించి వారి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గృహ నిర్మాణ సంస్థ పి డి ని ఆదేశించారు జిల్లాలో 84. కి మీ లలో 7 డ్రైన్స్ ఉన్నాయని తుపాను తగ్గిన తర్వాత నీరు ఎక్కువుగా రావడం జరుగుతుందని అవసరమైన చోట్ల జె సి బి లు పెట్టాలని డ్రైన్ ఈ ఈ ని ఆదేశించారు. ఈ సమావేశం లో ఇంచార్జి డి ఆర్ ఓ.లవన్న, డి ఎఫ్ ఓ.సౌజన్య, జడ్పీ సి ఈ ఓ.సి హెచ్ విజయలక్ష్మి, బాపట్ల ఆర్ డి ఓ.ఏ.హరి కుమార్,డి యం & హెచ్ ఓ.డాక్టర్ ఎస్. విజయమ్మ, డి సి హెచ్ ఎస్.డాక్టర్ పద్మావతి, డి ఈ ఓ.శ్రీనివాస్ సింగ్,జిల్లా వ్యవసాయ అధికారిణి ఏ.లక్ష్మి, వీడియో కాన్ఫరెన్స్ కు డిఆర్ఓ, ఆర్డీఓలు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.