BREAKING
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలి పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు - అడిషనల్ ఎలక్షన్ అథారిటీ వై.ఓ నందన్ గ్లోబల్ మార్కెట్ల సాంకేతిక విశ్లేషణ...ట్రెండింగ్ గ్రాఫిక్స్ మరియు వాణిజ్య సరళి కొమురం భీమ్ ఆశయాలను సాధించాలి ఈజీజెట్ విమానాల్లో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు "సర్వేపల్లి లో వై కా పా లోకి వరస చేరికలతో చతికిలపడ్డ టి డి పి " సూర్యని పొగడ్తల్లో ముంచెత్తిన నటి నజ్రియా నాజిమ్ కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* లాభాల బాటలో లండన్ మార్కెట్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ ఆధ్యాత్మిక శోభతో సత్యనారాయణ స్వామి ఆలయం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు కార్పొరేట్ రుణాల ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...డాయిష్ బ్యాంక్ కీలక అడుగు 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన నాయకుల విస్తృత ప్రచారం! అర్నబ్' ముప్పుపై యంత్రాంగం అప్రమత్తం ఫెడెక్స్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జమేర్ జాక్సన్ నియామకం

ఏమి గుండెరా అది రిజ్వాన్..! పదవులు కాదు.. హోదాలు కాదు.. పార్టీ గెలుపే పరమావధి!

Select Suryaa Now
ఏమి గుండెరా అది రిజ్వాన్..! పదవులు కాదు.. హోదాలు కాదు.. పార్టీ గెలుపే పరమావధి!

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడేవారు చాలామంది ఉంటారు. కానీ పదవులు ఆశించకుండా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, పార్టీ గెలుపు కోసం తన శక్తినంతా ధారపోసే నిజమైన పార్టీ వీరాభిమానులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వమే కాగజ్గర్ రిజ్వాన్!

అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా రిజ్వాన్ సాగిస్తున్న పోరాటం మాటల్లో చెప్పలేనిది. మైనారిటీల తరఫున కీలక బాధ్యతలు భుజాన వేసుకుని, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న తీరు నిజమైన రాజకీయ నిబద్ధతకు నిదర్శనం. బయటకు పెద్దగా కనిపించకపోయినా.. తెరవెనుక తనదైన వ్యూహంతో, మొక్కవోని దీక్షతో, చాపకింద నీరులా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కనిపించని యోధుడు రిజ్వాన్!

క్షణం తీరిక లేకుండా ప్రతి ఒక్కరినీ కలుస్తూ, అసంతృప్తులను బుజ్జగిస్తూ, విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయమే అందరి లక్ష్యంగా ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. తనకు ఏ పదవి వస్తుందన్న ఆలోచన లేకుండా.. పార్టీ అభ్యర్థి విజయం కోసం తన భుజస్కంధాలపై బాధ్యతను మోస్తున్నాడు. ఇదీ అసలైన అభిమానం.. ఇదీ నిజమైన విధేయత.. ఇదీ పార్టీ కోసం తపించే గుండె చప్పుడు!

రమేష్ గౌడ్ మేయర్ కావాలి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలి.. అప్పటివరకు రిజ్వాన్ పోరాటం ఆగదు! ఇదే అతని సంకల్పం.. ఇదే అతని లక్ష్యం.. ఇదే అతని కార్యాచరణ!

రాజకీయాల్లో నాయకులు కనిపిస్తారు.. కార్యకర్తలు నినదిస్తారు.. కానీ విజయం కోసం తెరవెనుక సైన్యాన్ని సమీకరించి, చెల్లాచెదురైన శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే వారే అసలైన వ్యూహకర్తలు. కాగజ్గర్ రిజ్వాన్ అలాంటి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడనే సందేశం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో బలంగా వెళ్లాలి.

పదవి కోసం కాదు.. పార్టీ కోసం! పేరు కోసం కాదు.. గెలుపు కోసం! స్వార్థం కోసం కాదు.. సమష్టి విజయం కోసం!

రాజకీయాల్లో నిజమైన వీరాభిమాని అంటే ఎవరో చెప్పడానికి రిజ్వాన్ చేస్తున్న కృషే ఒక ఉదాహరణ. వ్యక్తులు వేరు కావచ్చు.. అభిప్రాయాలు వేరు కావచ్చు.. కానీ లక్ష్యం ఒక్కటైతే విజయం దిశగా అడుగులు పడతాయి. ఆ ఐక్యతే బలం.. ఆ ఐక్యతే ఆయుధం.. ఆ ఐక్యతే విజయానికి పునాది!

రమేష్ గౌడ్ మేయర్ పీఠం అధిరోహించే వరకు వెనక్కి తగ్గని సంకల్పం.. పార్టీ శ్రేణులను ఏకం చేసే తపన.. గెలుపే శ్వాసగా సాగుతున్న ప్రయాణం.. ఇదే కాగజ్గర్ రిజ్వాన్ రాజకీయ నిబద్ధత..

 

రిపోర్టర్ మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.