BREAKING
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలి పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు - అడిషనల్ ఎలక్షన్ అథారిటీ వై.ఓ నందన్ గ్లోబల్ మార్కెట్ల సాంకేతిక విశ్లేషణ...ట్రెండింగ్ గ్రాఫిక్స్ మరియు వాణిజ్య సరళి కొమురం భీమ్ ఆశయాలను సాధించాలి ఈజీజెట్ విమానాల్లో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు "సర్వేపల్లి లో వై కా పా లోకి వరస చేరికలతో చతికిలపడ్డ టి డి పి " సూర్యని పొగడ్తల్లో ముంచెత్తిన నటి నజ్రియా నాజిమ్ కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* లాభాల బాటలో లండన్ మార్కెట్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ ఆధ్యాత్మిక శోభతో సత్యనారాయణ స్వామి ఆలయం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు కార్పొరేట్ రుణాల ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...డాయిష్ బ్యాంక్ కీలక అడుగు 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన నాయకుల విస్తృత ప్రచారం! అర్నబ్' ముప్పుపై యంత్రాంగం అప్రమత్తం ఫెడెక్స్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జమేర్ జాక్సన్ నియామకం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Select Suryaa Now
ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం మేజర్ న్యూస్ 

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎంతో ఘనంగా నిర్వహిస్తోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్న కారణంగానే సాంస్కృతిక కార్యక్రమాలను తగ్గించాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

జగన్ పాలనపై తీవ్ర విమర్శలు

విజయనగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్-1గా తీర్చిదిద్దేందుకు అహరహం కృషి చేస్తుంటే, జగన్ మాత్రం రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

గత ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ చేసిన అరాచకాలు, సృష్టించిన ఇబ్బందులను ప్రజలంతా కళ్లారా చూశారని గుర్తుచేశారు. జగన్ వైఖరిని ఎద్దేవా చేస్తూ, సొంత మేనకోడలి పెళ్లికి కూడా తన బిల్డింగ్ ఇవ్వని చరిత్ర ఆయనదని, మేనకోడలి పెళ్లికి అడ్డుపడిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.

2021 స్థానిక ఎన్నికల అక్రమాలపై గణాంకాలు

గొడ్డలి పార్టీ అరాచకాలు పుంగనూరు, రాయచోటి, కడప, పులివెందుల ప్రాంతాల్లో ఎలా సాగాయో ప్రజలకు తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలను గణాంకాలతో సహా వివరించారు:

 * 1,045 బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు చేయించారు.

 * 322 అక్రమ కేసులు నమోదు చేశారు.

 * 160 దాడులు, 3 హత్యలు చేశారు.

 * పుంగనూరులో 85 పంచాయతీలకు గాను 85, మాచర్లలో 77 కి 74 పంచాయతీలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్న చరిత్ర వైఎస్సార్‌సీపీదేనని ఆరోపించారు.

 పంచాయతీ నిధులు ₹12,600 కోట్లు అడ్డుకోవడమే కాకుండా, బీసీలకు టిక్కెట్లు ఇస్తే దళితులతో దాడులు చేయించి 59 కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల్లో 100% ఘన విజయం సాధిస్తాం

గతంలో రిజర్వేషన్ల కోసం తమ నాయకులు నామినేషన్ కూడా వేయలేకపోయిన పరిస్థితులు ఉండేవని, కానీ నేడు కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి తెలిపారు.

గడిచిన రెండున్నరేళ్ల కాలంలో తాము చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తున్నామని చెప్పారు. ప్రజలకు మరింత దగ్గర కావాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100% ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం