BREAKING
బాలిక కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్ల దందా!? ఏమి గుండెరా అది రిజ్వాన్..! పదవులు కాదు.. హోదాలు కాదు.. పార్టీ గెలుపే పరమావధి! ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిశంబరు 4-6 తేదీల్లో తిరుపతిలో డిజిపిలు,ఐజిపిల సమావేశం-ప్రధాని,హోంమంత్రి హాజరు జీవనధార ఫౌండేషన్ సేవా కార్యక్రమం ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి - ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలి : సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి .టి.విజయ్ కుమార్ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హైమావతి అహన్ పాండే కొత్త చిత్రానికి బెపర్‌వాహ్‌ టైటిల్ ఖరారు.. విడుదల తేదీ ప్రకటన! కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం... గుజ్జుల..! వెల్దుర్తిలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ.

అజేష్ గెలిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్ర అభివృద్ధి.. సినీనటుడు, బీజేపీ నేత సాయికుమార్ పిలుపు

Select Suryaa Now
అజేష్ గెలిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్ర అభివృద్ధి.. సినీనటుడు, బీజేపీ నేత సాయికుమార్ పిలుపు

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- అనంతపురం నగరంలో బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్‌ను గెలిపిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి వేగవంతమవుతుందని సినీనటుడు, బీజేపీ సీనియర్ నాయకుడు సాయికుమార్ అన్నారు. సోమవారం ఉదయం అర్బన్ టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటితో కలిసి క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, నాయకులతో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాతో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలోనూ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే అజేష్‌తో పాటు 62 డివిజన్ల కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకులు ఏమిస్తారన్నది కాకుండా ఏం చేస్తారో ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని, కూటమి రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలన్నారు. అజేష్ గెలిస్తే నగర అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొన్నారు. అనంతపురం సమగ్ర అభివృద్ధి కోసం మేయర్ అభ్యర్థితో పాటు 62 డివిజన్ల కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు.