తెరుచుకోని 'స్వర్ణ'.. వెనుతిరుగుతున్న జనం!
వెల్దుర్తి (సూర్య ప్రతినిధి రూలర్ మేజర్ న్యూస్):మండల పరిధిలోని చెరుకులపాడు 'స్వర్ణ' (స్వర్ణ జయంతి / గ్రామ పంచాయతీ) కార్యాలయం వేళాపాళా లేకుండా నడుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకే కార్యాలయానికి తాళాలు వేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెరుకులపాడు మజరా గ్రామమైన కొసనాపల్లె ప్రజలు నిత్యం వివిధ పనుల నిమిత్తం ఈ కార్యాలయానికి వస్తుంటారు. అయితే, మధ్యాహ్నం రెండు గంటలకే ఆఫీస్ మూసివేయడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పనులు కాక తీవ్ర నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో అర్థం కావడం లేదని, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయ పనివేళలను సరిచేసి, అధికారుల రాకపోకలపై పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. సూర్య ప్రతినిధి కె రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం