BREAKING
ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ సంచలన వ్యాఖ్యలు చేసిన కీర్తి సురేశ్ యూరో జోన్ కంపెనీలకు పెరుగుతున్న ఆర్థిక కష్టాలు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ విద్యుత్ షాక్‌తో యువ మెకానిక్ దుర్మరణం..! ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి-- కమిషనర్ గంగాప్రసాద్ ఇంధన రంగంలో 50 బిలియన్ డాలర్లకు రేంజ్ రిసోర్సెస్ కొనుగోలు దిశగా ఈక్యూటీ మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జగన్ ను కలిసిన జీకే కృష్ణమూర్తి. మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - ఈ ఈ ఉష్ణమండల అడవుల పరిరక్షణకు నెదర్లాండ్స్ భారీ విరాళం జాక్సన్ సోలార్ నుంచి 525 మిలియన్ డాలర్ల ప్రణాళిక బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారం.. జపాన్ ఆటో యూనిట్ల కీలక నిర్ణయం 27 ఏళ్ల తర్వాత 'ప్రభుదేవా - సిమ్రాన్' జంటగా కొత్త సినిమా

అర్ణబ్' తుఫాన్ హెచ్చరికలు: విద్యుత్ పునరుద్ధరణకు ముందస్తు ఏర్పాట్లు

Select Suryaa Now
అర్ణబ్' తుఫాన్ హెచ్చరికలు: విద్యుత్ పునరుద్ధరణకు ముందస్తు ఏర్పాట్లు

విజయనగరం, అక్టోబర్ 26 , మేజర్ న్యూస్:

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణబ్’ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) విజయనగరం సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ (SE) మువ్వల లక్ష్మణరావు తెలిపారు.

అధికారులు, సిబ్బంది అప్రమత్తం

తుఫాన్ ధాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, లైన్లు తెగిపోవడం వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున సర్కిల్ పరిధిలోని అధికారులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్లు ఎస్ఈ తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగాదన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వాహనాలు మరియు ఇతర అవసరమైన సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసి ఉంచినట్లు పేర్కొన్నారు.

ప్రజలకు ముఖ్య సూచనలు

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా రహదారులపై గానీ, పొలాల్లో గానీ తెగిపడిన విద్యుత్ తీగలు, ఒరిగిపోయిన స్తంభాల వద్దకు ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు.

అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్లు:

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినా లేదా అత్యవసర సహాయం కావాలన్నా ప్రజలు వెంటనే క్రింది నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు:

 * టోల్ ఫ్రీ నంబర్: 1912

 * విజయనగరం కంట్రోల్ రూమ్: 9490610102, 9490610103

 * బొబ్బిలి కంట్రోల్ రూమ్: 9490610123

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం