బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారం..
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : 12, 13, 14వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్ రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేడు 13, 14, 15వ వార్డుల్లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు, కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లోని ప్రతి గడపకు వెళ్లి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ షకీలా బేగం గారితో పాటు 23 వార్డుల్లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు గారు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.