BREAKING
రాయదుర్గం 15వ వార్డులో టీడీపీ ప్రచార జోరు - ఇంటింటికీ చైర్మన్ అభ్యర్థి హనుమంతు, నాగరాజ్ నాయక్* జయసూర్య 'మాయన్' చాప్టర్ 1 కొత్త పోస్టర్ విడుదల.. ఉత్కంఠ రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ లుక్ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి ఎస్ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా కూటమికి ధరల మంట!... స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు - టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.. కొమురం భీమ్‌కు ఘన నివాళులు కూటమి ప్రచార హోరు ఎమ్మెల్యే సొంగాకు ఘన స్వాగతం ప్రజావాణికి 33 దరఖాస్తులు.. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలులో నిర్లక్ష్యం వద్దు -ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రతి రోజూ చేరికలే.. పార్టీకి పెరుగుతున్న ఆదరణ! అటవీ సంపదపై కళాకారుల ప్రచారం వేతనాలు చెల్లించాలని ఎం పి డివో కు వినతి పైడి తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలి *స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం * నామినేషన్ల ఉపసంహరణ దేవునిగూడెంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

వ్యాపారం పేరుతో రూ.50 లక్షలు స్వాహా చేసి బెదిరింపులకు దిగిన వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు

Select Suryaa Now
వ్యాపారం పేరుతో రూ.50 లక్షలు స్వాహా చేసి బెదిరింపులకు దిగిన వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు

కర్నూరు, మేజర్‌న్యూస్‌ :

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పొన్నా శంకరయ్య (ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసం), కడపకు చెందిన పట్నం లక్ష్మీనారాయణలు తనను సంప్రదించారు. కడప జిల్లా మైలవరం మండలం వద్దిరాల వద్ద ఎంఆర్‌కేఆర్ సంస్థ పరిధిలోని క్రషర్ మిషన్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పిస్తామని నమ్మించారు. 07-06-2021 నాటి ఒప్పుదల అగ్రిమెంట్ ప్రకారం మొత్తం రూ.50 లక్షలు సమకూర్చాను. ఇందులో రూ.30 లక్షలను 'మెసర్స్ లక్ష్మి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్' ఓనర్ పట్నం లక్ష్మి బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశారు. మిగిలిన రూ.20 లక్షలను పొన్నా శంకరయ్య, ఆయన భార్య మీనా, పట్నం లక్ష్మీనారాయణ, పట్నం లక్ష్మిల సమక్షంలో సాక్షుల ఎదుట నగదు రూపంలో అందజేశాను. ఒప్పందం ప్రకారం వ్యాపారంలో రావాల్సిన లాభం గానీ, అసలు మొత్తం గానీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇటీవల ప్రొద్దుటూరులో నిందితులను కలిసి నిలదీయగా, "మేము వైసీపీ నాయకులం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో" అంటూ దుర్భాషలాడి, డబ్బులడిగితే చంపేస్తామని బెదిరించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచెర్ల కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎం. అనిల్ కుమార్  గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నంబర్ 144లో తమ తల్లి పేరిట ఒక ఎకరా భూమి ఉంది. ఈ భూమి విషయంలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్వో తమకు అనుకూలంగా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని చట్టబద్ధమైన పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ, పెనకచెర్లకు చెందిన వైఎస్సార్సీపీ నాయకురాలు బి. రామాంజనమ్మ ఆ భూమితో పాటు సర్వే నంబర్ 81లోని భూమిని కూడా అక్రమంగా కబ్జా చేశారు. ఈ విషయంపై అధికారులకు ఐదుసార్లు వినతిపత్రాలు అందజేశాం. అయినప్పటికీ గార్లదిన్నె తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వో, స్థానిక వీఆర్ఏ కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లి గ్రామానికి చెందిన కె. మంజునాథ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. దివ్యాంగుడైన తాను పశువులను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. గ్రామంలోని సర్వే నంబర్ 141/5లో 1.00 ఎకరం, అలాగే సర్వే నంబర్ 141/3Gలో 0.20 సెంట్ల భూమి ఉంది. జీవనాధారమైన ఈ భూమిని పి. సుబ్రమణ్యం శెట్టి, కె. అశ్వత్థమ్మ అనే వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మార్వో, వీఆర్వోలకు అర్జీ సమర్పించినా వారు న్యాయం చేయకుండా, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పప్పిరెడ్డిపల్లికి చెందిన ఆర్. నారాయణస్వామి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..1972లో తన తండ్రి ఆర్. గుర్రప్ప గారు కొనుగోలు చేసిన భూమిని అప్పటి నుండి తామే సాగు చేసుకుంటున్నాం. క్రమం తప్పకుండా భూమి శిస్తు చెల్లిస్తూ, విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం 1B, 10(1) అడంగల్‌తో పాటు ప్రభుత్వమే జారీ చేసిన మూడు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా తమ పేరిటే ఉన్నాయి. గతంలో సెటిల్‌మెంట్ ఆర్డర్ కాపీలో ఎస్సార్ నంబర్ నమోదు కాలేదన్న నెపంతో, ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా (22A)లో చేర్చి రిజిస్ట్రేషన్ కాకుండా నిలిపివేశారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పాత పూసలమర్రు గ్రామానికి చెందిన పుష్పరాజ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో డోర్ నంబర్ 1/100-4లో నివసిస్తున్న దివ్యాంగుడైన తన ఇంటి ఖాళీ స్థలంలోకి చొచ్చుకొచ్చి, బొమ్మిడి లక్ష్మీ నాగేశ్వరమ్మ అనే వ్యక్తి దౌర్జన్యంగా నిర్మాణం చేపడుతున్నారు. ఈ స్థలం సరిహద్దులకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వ సర్వేయర్లెవరూ వచ్చి అధికారికంగా కొలతలు వేయలేదు. దీనివల్ల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.