వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఘన నివాళులు*
*జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ప్రసూన తదితరుల నివాళులు*
కర్నూలు, అక్టోబర్ 26: వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో సోమవారం వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ప్రసూన, కార్యాలయ పరిపాలన అధికారి రవి కుమార్ తదితరులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలు సమర్పించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి జీవిత విశేషాలను, సమాజానికి ఆయన అందించిన విలువైన సందేశాలను స్మరించుకున్నారు. భారతీయ సాహిత్యంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందిన మహర్షి వాల్మీకి రచించిన రామాయణం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రామాయణం ద్వారా ఆయన అందించిన ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలు సమాజానికి స్ఫూర్తినిస్తున్నాయని గుర్తుచేశారు. వాల్మీకి మహర్షి జీవితం, ఆయన సాహిత్య సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన బోధనలు సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. మహర్షి ఆశయాలను స్మరించుకుంటూ సమాజ అభ్యున్నతికి, సద్గుణాల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.