BREAKING
జయసూర్య 'మాయన్' చాప్టర్ 1 కొత్త పోస్టర్ విడుదల.. ఉత్కంఠ రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ లుక్ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి ఎస్ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా కూటమికి ధరల మంట!... స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు - టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.. కొమురం భీమ్‌కు ఘన నివాళులు కూటమి ప్రచార హోరు ఎమ్మెల్యే సొంగాకు ఘన స్వాగతం ప్రజావాణికి 33 దరఖాస్తులు.. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలులో నిర్లక్ష్యం వద్దు -ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రతి రోజూ చేరికలే.. పార్టీకి పెరుగుతున్న ఆదరణ! అటవీ సంపదపై కళాకారుల ప్రచారం వేతనాలు చెల్లించాలని ఎం పి డివో కు వినతి పైడి తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలి *స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం * నామినేషన్ల ఉపసంహరణ దేవునిగూడెంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అల్లీపురం గ్రామంలో బాలల హక్కులు,పలు అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం

అర్నబ్ తుపాన్‌ ప్రభావం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు

Select Suryaa Now
అర్నబ్ తుపాన్‌ ప్రభావం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు

 

# ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

రేణిగుంట మేజర్ న్యూస్: తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్‌ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గత ఆరు గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తుపాన్‌ కదిలినట్లు తెలిపింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 540 కి.మీ., కాకినాడకు 620 కి.మీ., మచిలీపట్నానికి 720 కి.మీ., బాపట్లకు 790 కి.మీ. దూరంలో తుపాన్‌ కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. తుపాన్‌ ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాన్‌ తీరానికి దగ్గరయ్యే కొద్దీ తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రేపు, ఎల్లుండి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచించారు.

రిపోర్టర్: రమేష్ బాబు కొండల