వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం
*వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం..ఎమ్మెల్యే అమిలినేని*
*అంగరంగ వైభవంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు*
*వాల్మీకి సోదరులు, మహిళా నాయకురాళ్ళతో కలసి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే అమిలినేని*
*రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణదుర్గంలో ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది..ఇది కూటమి ప్రభుత్వ విజయం*
*కళ్యాణదుర్గం పట్టణం ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుంది..*
*నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు ఋణపడి ఉంటా..చాపిరి చెరువుకు నీళ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది..*
*2028 మార్చి నాటికి బీటీపీతో పాటు అన్ని చెరువులకు నీళ్లు అందిస్తాం.*
*కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించండి*
గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా అవినీతి, అక్రమాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని, రాష్ట్రంలో వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని వారి నాయకుడే మూర్ఖుడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఏ నియోజకవర్గంలోనూ జరగని విధంగా ఎలాంటి గొడవలు, అల్లర్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో అన్ని పార్టీల వాళ్ళు నామినేషన్ లు వేయగలిగారంటే అది కూటమి ప్రభుత్వ విజయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పేర్కొన్నారు..నేడు రామాయణ రచయిత మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ప్రజావేదికలో స్థానిక వాల్మీకి సోదరులు, మహిళా నాయకురాళ్ళతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ మన ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులకు ముఖ్యకారకులు గత వైసీపీ పాలకులని, ఉమ్మడి అనంత జిల్లాకు తాగునీటి కోసం నాడు భగవాన్ సత్యసాయి గారు నీళ్లు అందిస్తే వాటిని నిర్వహించే వైసీపీ కాంట్రాక్టర్లు కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా బకాయిలు పెట్టడంతో కార్మికులు దీక్షలు చేసి నీటిని వదలకుండా ఉండటంతోనే నీళ్లు అందకుండా పోతున్నాయని ఇక ముందు అలాంటి ఇబ్బందులు రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణంలోని 13 వేల ఇళ్లకు కుళాయి ఇచ్చేందుకు 179 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని, అంతే కాకుండా బీటీపీతో పాటే నియోజకవర్గంలోని చెరువులకు కూడా 2028 మార్చి నాటికి కృష్ణా జలాలతో నింపుతామని, మొన్న చాపిరి చెరువుకు నీళ్లు ఇవ్వడంతో ప్రజల్లో కూడా నమ్మకం పెరిగిందని, ఎట్టి పరిస్థితిలో కూడా వైసీపీకి ఓటు వేయకుండా కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.