BREAKING
ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ సంచలన వ్యాఖ్యలు చేసిన కీర్తి సురేశ్ యూరో జోన్ కంపెనీలకు పెరుగుతున్న ఆర్థిక కష్టాలు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ విద్యుత్ షాక్‌తో యువ మెకానిక్ దుర్మరణం..! ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి-- కమిషనర్ గంగాప్రసాద్ ఇంధన రంగంలో 50 బిలియన్ డాలర్లకు రేంజ్ రిసోర్సెస్ కొనుగోలు దిశగా ఈక్యూటీ మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జగన్ ను కలిసిన జీకే కృష్ణమూర్తి. మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - ఈ ఈ ఉష్ణమండల అడవుల పరిరక్షణకు నెదర్లాండ్స్ భారీ విరాళం జాక్సన్ సోలార్ నుంచి 525 మిలియన్ డాలర్ల ప్రణాళిక బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారం.. జపాన్ ఆటో యూనిట్ల కీలక నిర్ణయం 27 ఏళ్ల తర్వాత 'ప్రభుదేవా - సిమ్రాన్' జంటగా కొత్త సినిమా

రాయదుర్గం పట్టణంలో 17వ వార్డులో కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం*

Select Suryaa Now
రాయదుర్గం పట్టణంలో 17వ వార్డులో కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం*

రాయదుర్గం టౌన్ (రాయదుర్గం టౌన్, మేజర్ న్యూస్) : రాయదుర్గం పురపాలక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ వార్డులో కూటమి నేతలు విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు,కూటమి చైర్మన్ అభ్యర్థి టంకశాల హనుమంతుతో కలిసి 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మోపూరి అశోక్ ఇంటింటా తిరిగి ఓట్లు అభ్యర్థించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాయదుర్గం అభివృద్ధి కూటమితోనే సాధ్యమని, గత వైసీపీ పాలనలో పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 17వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చైర్మన్ అభ్యర్థిగా టంకశాల హనుమంతును, వార్డు అభ్యర్థిగా మోపూరి అశోక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, బంగి శంకర్, ధనుంజయ, కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మహేష్, రాయదుర్గం టౌన్, రాయదుర్గం.