13వ వార్డులో తిరుమలేష్ యాదవ్ ప్రచార సందడి
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ 13వ వార్డు అభ్యర్థి తిరుమలేష్ యాదవ్ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించారు. వార్డులోని వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్