BREAKING
ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి-- కమిషనర్ గంగాప్రసాద్ ఇంధన రంగంలో 50 బిలియన్ డాలర్లకు రేంజ్ రిసోర్సెస్ కొనుగోలు దిశగా ఈక్యూటీ మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జగన్ ను కలిసిన జీకే కృష్ణమూర్తి. మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - ఈ ఈ ఉష్ణమండల అడవుల పరిరక్షణకు నెదర్లాండ్స్ భారీ విరాళం 'నాలో ఏదో లోపం ఉందనుకున్నా'కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు జాక్సన్ సోలార్ నుంచి 525 మిలియన్ డాలర్ల ప్రణాళిక బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారం.. జపాన్ ఆటో యూనిట్ల కీలక నిర్ణయం 27 ఏళ్ల తర్వాత 'ప్రభుదేవా - సిమ్రాన్' జంటగా కొత్త సినిమా ఈ నెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షేర్ల పతనం రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఉపసంహరణపై ఉద్యమం చేస్తాం : ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా స్పేస్‌ఎక్స్ మరియు టెస్లా ఆర్థిక పరిస్థితి

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ

Select Suryaa Now
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య సత్సంబంధాలను పెంపొందించడం, పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రజలకు వివరించడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, అక్టోబర్ 26వ తేదీ సోమవారం బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, వాటి పనితీరు, సాంకేతిక ఉపకరణాలు, వేలిముద్రల సేకరణకు ఉపయోగించే పరికరాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఎస్పీ గారు స్వయంగా విద్యార్థులకు వివరించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సందర్శించేందుకు బాపట్ల జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ అధికారులు వీఐపీ బందోబస్తు విధుల్లో, ప్రధాన కార్యాలయాల వద్ద తనిఖీల సమయంలో ఉపయోగించే పరికరాలు, పోలీస్ సిబ్బంది పరస్పరం సంభాషించుకోవడానికి వినియోగించే మ్యాన్‌ప్యాక్ సెట్లు, నేర పరిశోధనలో సహాయపడే పోలీస్ జాగిలాల బృందాల పనితీరు గురించి విద్యార్థులకు వివరించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో వినియోగించే బాడీ వోర్న్ కెమెరాలు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) కెమెరాలు, డ్రోన్లు, డ్రోన్ కెమెరాల పనితీరు, శక్తి బృందాల విధులు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ సంకేతాలు, పోలీస్ అధికారుల ర్యాంకులు, వారు నిర్వహించే విధులు, సమాజంలో పోలీసుల పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ జాగిలాల ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించామన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం, వారిని గౌరవించి సన్మానించడం, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల పిల్లలకు కూడా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు మారథాన్, వాక్‌థాన్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు, జిల్లా ప్రజల కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నేడు నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీస్ శాఖ నిత్యం వినియోగించే సాంకేతిక పరికరాలు, ఆయుధాలు, ఇతర ఉపకరణాలను ప్రదర్శించడం జరిగిందన్నారు. నేరాల ఛేదనలో పోలీస్ జాగిలాలను ఏ విధంగా వినియోగిస్తారు, క్లూస్ టీమ్‌కు సంబంధించిన పరికరాలు నేర పరిశోధనలో ఏ విధంగా ఉపయోగపడతాయనే అంశాలను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు పోలీస్ సిబ్బంది వినియోగించే ఆయుధాలు, పరికరాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. మహిళలు, బాలబాలికలకు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు శక్తి బృందాలు ఏ విధంగా స్పందిస్తాయి, శక్తి యాప్‌ను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటనే అంశాలపై విద్యార్థులు సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. ప్రయాణ సమయంలో లేదా ఏదైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు పోలీస్ శాఖ నుంచి తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకుని, అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ సిహెచ్ చంద్రమౌళి, ఏఆర్ డీఎస్పీ పి. కృష్ణంరాజు, బాపట్ల టౌన్, రూరల్ సిఐ లు రాంబాబు, సుబ్బారావు లు, అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, హోమ్ గార్డ్ ఆర్‌ఐ ప్రదీప్  తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.