సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ మోసంతో ప్రజలను వంచించారు
సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ మోసంతో ప్రజలను వంచించారు
ఓటరన్న అలోచించి డాక్టర్ రఘుకు మరో అవకాశం ఇవ్వండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి విజ్ఞప్తి
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో 11, 12, 13వ వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరారు.11వ వార్డులో హసీనా బాను తరఫున మెకానిక్ సాదిక్ ఆధ్వర్యంలో, 12వ వార్డులో అబ్దుల్లా తరఫున, 13వ వార్డులో కె. భారతి, బీరప్ప తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు బనవాసి బసి రెడ్డి పేర్కొన్నారు. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించి హామీలను అమలు చేయాలని కోరారు.డాక్టర్ రఘుకు మరో అవకాశం ఇవ్వండి.
ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కె.ఎస్. రఘు మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని పేర్కొంటూ తనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
వైసీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని రాజీవ్ రెడ్డి, బనవాసి బసి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా