BREAKING
31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత. చిన్నగంజాం మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు. కొనగళూరు లో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం మూడు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత ఎలినీనోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి టీడీపీలోకి భారీగా వలసలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతున్న వైకాపా శ్రేణులు పర్చూరులో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం పసుపుమయమైన పడారుపల్లి వేలాదిమందితో ర్యాలీ అత్యంత పేదరికం ఉన్నవారిలో మార్పులు తీసుకురావాలి - రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తిరుమలలో ఆధ్యాత్మిక శోభ.. కళాకారులతో కలిసి కోలాటం ఆడిన నందమూరి కుటుంబ సభ్యులు

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్

Select Suryaa Now
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్

నాగులుప్పులపాడు, మేజర్‌న్యూస్ :

నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ బి. ఎన్. విజయ్ కుమార్ గారు చదలవాడ గ్రామానికి చేరుకుని బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే గారు, *బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని* భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గారు స్వయంగా జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఘటన వివరాలను చర్చించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు విచారణను సమర్థవంతంగా నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆరేళ్ల బాలికపై జరిగిన ఈ అమానవీయ ఘటనను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గారు, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని,వారికి న్యాయం జరిగే వరకు తగిన విధంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.