పసుపుమయమైన పడారుపల్లి వేలాదిమందితో ర్యాలీ
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ పడారుపల్లిలో ఎన్నికల ప్రచార ర్యాలీలో నెల్లూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు నగర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ని, అలాగే 35వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి దుద్దుగుంట (ఒరిస్సా) శ్రీనివాసులు రెడ్డి ని అత్యధిక ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.