BREAKING
సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన పామూరులో టీడీపీ క్లీన్‌స్వీప్ 34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి.. టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!.. సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి.. ఒక ఎంపీటీసీ టీడీపీ కైవసం ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ సీతారామపురం ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఎంపీపీ పువ్వాడి దంపతులకు ఘన సన్మానం "వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి" ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

రెండు ఎంపీటీసీ స్థానాలు తెదేపా ఏకగ్రీవం.

Select Suryaa Now
రెండు ఎంపీటీసీ స్థానాలు తెదేపా ఏకగ్రీవం.

సూర్య న్యూస్ అద్దంకి.

12 స్థానాలలో 28 మంది అభ్యర్థులు పోటీ.
అద్దంకి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన మంగళవారం నాటికి మండల పరిధిలోని రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సంబంధిత వివరాలను రిటర్నింగ్ అధికారి రవికుమార్ వెల్లడించారు. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు గాను నామినేషన్ల పరిశీలన అనంతరం 68 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ లో ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి రెండు ఎంపీటీసీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవం కాగా 38 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 12 చోట్ల 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలియజేశారు.
ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాలు...
మండలంలోని కలవకూరు ఎంపీటీసీ స్థానాన్ని తెదేపా అభ్యర్థి సందెపాం జేమ్స్, దేనువకొండ ఎంపీటీసీ స్థానాన్ని తెదేపా అభ్యర్థి ఇండ్ల వెంకాయమ్మ  కైవసం చేసుకుని ఏకగ్రీవంగా నిలిచారు. ఈ రెండు స్థానాల్లో ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో తెదేపా అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.