BREAKING
ప్రాణనష్ట నివారణే లక్ష్యం: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన పామూరులో టీడీపీ క్లీన్‌స్వీప్ 34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి.. టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!.. సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి.. ఒక ఎంపీటీసీ టీడీపీ కైవసం ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ సీతారామపురం ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఎంపీపీ పువ్వాడి దంపతులకు ఘన సన్మానం "వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి" ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి

అందరూ ఆదరించి విజయం చేకూరిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తా - వైసీపీ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి

Select Suryaa Now
అందరూ ఆదరించి విజయం చేకూరిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తా - వైసీపీ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ తనను ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూరిస్తే తాను ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆత్మకూరు మున్సిపల్ వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుమతి ప్రసంగించారు. గత 50 సంవత్సరాలుగా తమ అల్లా రెడ్డి కుటుంబంలోని తమ మామ అల్లా రెడ్డి కృష్ణారెడ్డి మండలాధ్యక్షుడుగా, తమ అత్త అల్లారెడ్డి అనసూయమ్మ సర్పంచ్ గా, తన భర్త అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా ప్రజలకు సేవలు అందించారని,వాటిని గుర్తించాలని, తాను అందుబాటులో ఉంటూ అందరి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని ఇందుమతి పేర్కొన్నారు. ప్రధానంగా ఆత్మకూరు పట్టణంలోని తిప్ప ప్రాంతాల్లో పేద వర్గాల నివాసాలు ఉండగా గతంలో ఎవరు వారి గురించి పట్టించుకోలేదని, విజయం చేకూరిస్తే వాళ్లకు ఇంటి స్థలాలను పట్టాలుగా ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని ఇందుమతి పేర్కొన్నారు.తమ పార్టీ నుండి కొందరు నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లినంత మాత్రాన ప్రజల్లో అభిమానం చెక్కుచెదరలేదని, తమ కుటుంబాన్ని ఆదరిస్తారన్న విశ్వాసం తమకుందని, అందరూ ఆదరించి తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఇందుమతి కోరారు.సమావేశంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య మాట్లాడుతూ గతంలో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోఅన్ని వర్గాలకు అనూహ్యంగా సంక్షేమ ఫలాలు అందించారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన ఇప్పటికీ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదని, మహిళలకు నెలకి 1500 రూపాయల హామీ అమలు చేయలేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఈ ప్రభుత్వం పై ఉందని, తమ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్ పర్సన్ గా పోటీ చేస్తున్న అల్లారెడ్డి ఇందుమతికి ప్రజాదరణవిశేషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అల్లారెడ్డి కుటుంబం నిస్వార్థ రాజకీయాలు అందరికీ తెలిసిందే అన్నారు. ఆత్మకూరు మున్సిపల్ ప్రజలు వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి విజయం చేకూర్చాలని డాక్టర్ ఆదిశేషయ్య కోరారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీలో సిపిఎం పొత్తుతో తమ పార్టీ 26 వార్డుల్లో రెండు చోట్ల సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి గా అనాదిగా ప్రజలకు సేవలు అందించిన అల్లారెడ్డి కుటుంబంలోని అల్లారెడ్డి కృష్ణారెడ్డి -అనసూయమ్మల కోడలు, ఆనంద రెడ్డి సతీమణి అల్లారెడ్డి ఇందుమతి పోటీ చేస్తున్నారని, అందరూ ఆదరించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరారు. అభివృద్ధి అభివృద్ధిఅని చెప్పుకునే కూటమి నేతలు అభ్యర్థిగా తమ పార్టీలోనే బలమైన కుటుంబాన్ని చీల్చి అభ్యర్థిగా ఏర్పాటు చేసుకోవడం సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైసీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి ఇందుమతి భర్త అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండ వెంకటేశ్వర్లు,పలువురు వైసిపి అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.