BREAKING
వింజమూరు మండలంలో స్థానిక సంస్థలు ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి టిడిపి 39 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాతాశీనాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ...ఇంటింటా ప్రచారానికి భారీ స్పందన ఓటీటీలోకి సందీప్ కిషన్ సిగ్మా సినిమా.. అక్టోబర్ 30 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ ప్రచారంలో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డికి జననీరాజనాలు - ఆదరిస్తున్న అన్ని వర్గాల ప్రజలు ఓటర్ల స్లిప్పులు పంపిణీ సక్రమంగా జరగాలి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.. డీపీఆర్ పంపితే కేంద్రం నుంచి రూ.3,000 కోట్ల నిధులు తెస్తా: ఎంపీ ఈటల రాజేందర్ మోస్ట్ అట్రాక్టివ్ మ్యాన్‌గా హాలీవుడ్ నటుడు నోవా వైల్.. పీపుల్స్ మ్యాగజైన్ అరుదైన గౌరవం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ముమ్మర ప్రచారం - అడుగడుగునా ఘన స్వాగతం హుషారు 2 టీజర్ విడుదల.. పవర్‌ఫుల్ రోల్‌లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం బాలుడి మృతి ఘటనపై తారా ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ కళ్యాణ్ చక్రవర్తి తనిఖీలు. గిద్దలూరు 9వ వార్డులో హోరాహోరీ ప్రచారం.. సైకిల్ వర్సెస్ గ్లాస్! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 17 మందికి జైలు శిక్ష

టీడీపీలోకి భారీగా వలసలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతున్న వైకాపా శ్రేణులు

Select Suryaa Now
టీడీపీలోకి భారీగా వలసలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతున్న వైకాపా శ్రేణులు

పలమనేరు  మేజర్ న్యూస్ 

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. పలమనేరు శాసనసభ్యుల అమరనాథ్ రెడ్డి సమక్షంలో వైకాపా చెందిన చాలా మంది  తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. ఆ మేరకు పెద్ద పంజాణి మండలంలోని గౌదమాకులపల్లి నాగిరెడ్డిపల్లి పంచాయతీల పరిధిలో సుమారు 50 మంది మంగళవారం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో టి. సుబ్రహ్మణ్యం, గురుమూర్తి జే.సుబ్బయ్య, లక్ష్మయ్య బి. సుబ్బయ్య, చంద్ర, జే.సుబ్రహ్మణ్యం, టికే పల్లికి చెందిన శంకర, వినోద్ వెంకటరమణ, సుబ్రహ్మణ్యం రెడ్డి, బొంతమాకులపల్లి,చంద్ర, రమణ, వెంకటరమణ, పి. సుబ్రహ్మణ్యం భాస్కర, సుధా తదితరులు వైకాపాను వీడారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపంజాణి మండలం మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు మణి, భూపతి, రామకృష్ణ,రామచంద్ర, మునంజు, త్యాగరాజు, వెంకటరెడ్డి,రాజన్న, తదితరులున్నారు. 

రంగాపురం వాసులు పార్టీలో చేరిక పలమనేరు పట్టణంలోని 5వ వార్డుకు చెందిన రంగాపురం వాసులు సుమారు 25 మంది వైకాపాను విడి ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరారు.ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సాధరంగా ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో వైకాపా సీనియర్ నాయకులు సురేష్ అలియాస్ రంగాపురం సూరి,వారి అనుచరులు చంద్రశేఖర్,సంతోష్, గోవిందరాజులు, కృష్ణ సాయి, చరణ్,సమీర్,నంద, చిరంజీవి,గణేష్, బి.చరణ్, దుర్గేష్, హర్షవర్ధన్, అజయ్, ఇర్ఫాన్,,జావిద్,అయ్యాజ్, అఫ్జల్, శివప్రసాద్, దనీష్, కిరణ్ కుమార్, నాని, విగ్నేష్, గోవర్ధన్, నవీన్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు కృష్ణమూర్తి గౌడ్, మదన్మోహన్ గౌడ్, నాయకులు జీలు, వీరప్ప, మురుగన్ తదితరులున్నారు.

 

 అనిల్ కుమార్ యాదవ్