పర్చూరులో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
పర్చూరు, మేజర్‌న్యూస్ :
పర్చూరు నియోజకవర్గంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతవరం, దర్శి, నాగరాజుపల్లి, కొడవలివారిపాలెం ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందించారు. ఏకగ్రీవమైన అభ్యర్థుల్లో అనంతవరం ఎంపీటీసీగా గుదే తారక రామారావు, దర్శి ఎంపీటీసీగా మేకల మాధురి, నాగరాజుపల్లి ఎంపీటీసీగా భూక్యా సొమ్లా నాయక్, కొడవలివారిపాలెం ఎంపీటీసీగా కోసరాజు సురేంద్రబాబు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగా నిలిచి కూటమి అభ్యర్థులను ఆదరించాలని పిలుపునిచ్చారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష,