telangana
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు భూసిమెట్ట విద్యార్థిని ఎంపిక
సూర్య జైనూర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న ఆసిఫాబాద్ గిరిజన క్రీడా పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో భూసిమెట్ట ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ పాఠశాలకు చెందిన విద్యార్థిని కుడ్మేత సందీ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ తక్షశీల, పీడీ సునీత మాట్లాడుతూ, జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని తెలిపారు.ఎంపికైన విద్యార్థినిని పాఠశాల అధ్యాపక బృందం అభినందించింది. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి గుండం లక్ష్మణ్, కోచ్ విద్యాసాగర్ ఆకాంక్షించారు.