రైతులు ఆరుతడి పంటలను వేయాలి
సూర్య- బిక్కనూర్ : రైతులు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల ఆరుతడి పంటలను వేయాలని, మండలంలోని పెద్ద మల్లారెడ్డి సొసైటీ చైర్మన్ రాజాగౌడ్ చెప్పాడు. మంగళవారం గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని వరి పంటకు బదులుగా పప్పు దినుసుల పంటలను వేయాలని వివరించారు. నీటి లభ్యతను బట్టి పంటలను వేసుకోవాల్సిన అవసరం ఉందని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ మోహన్ గౌడ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి, రైతులు పాల్గొన్నారు