ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ:
నీళ్లలో దిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సారంగాపూర్ మండలం జావులి గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఏఎల్‌ఎం రవి, సిబ్బంది అరుణ్ సాహసోపేతంగా స్పందించారు. స్వర్ణ డ్యామ్ నీటిలో ఉన్న విద్యుత్ స్తంభం వద్ద సాంకేతిక సమస్యను గుర్తించి, నీటిలోకి దిగి మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహించిన సిబ్బందిని ఉన్నతాధికారులు, గ్రామస్తులు అభినందించారు.