మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే న్యాయం చేయాలి
సీపీఎం మండల కార్యదర్శి రావుల జంగయ్య డిమాండ్
**మంచాల, అక్టోబర్ 28:** వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న మంచాల మండల రైతుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి రావుల జంగయ్య బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కరువు మండలాల జాబితాలో మంచాల మండలానికి చోటు కల్పించకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న మంచాల మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టి, పంటల పరిస్థితి, వర్షపాతం, రైతులకు జరిగిన నష్టాలను అంచనా వేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు, ప్రజాప్రతినిధులతో చర్చించి వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపాలని కోరారు. కరువు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని జంగయ్య అన్నారు. కేవలం జాబితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. మంచాల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
*✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల*