వైసిపి పార్టీ 50,51వార్డుల నాయకులు,కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి వరుదు కళ్యాణి, కె.కె రాజు
సీతమ్మధార, సూర్య : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం 50 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మువ్వల సంతోష్, 51వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సానబోయిన లలితకుమారి ఆధ్వర్యంలో సీతంపేట లో గల కల్యాణ మండపంలో జరిగిన 50, 51వార్డుల నాయకులు, కార్యకర్తలు సమావేశంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తరనియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు, వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి కి, 50వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మువ్వల సంతోష్ కి , 51వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సానబోయిన లలిత కుమారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జి.వి రవి రాజు, మువ్వల పోలారావు, దల్లి రామక్రిష్ణరెడ్డి, కర్రీ మురళీక్రిష్ణ రెడ్డి, సానబోయిన సురేష్, సారిపిల్లి సంతోష్, పోతిబంతి హరి, నూకరాజు, వెంపాడ శ్రీనివాసరెడ్డి, అంబటి శైలేష్, శ్రీనివాస్, బొమ్మాలి రవి,శ్రవణ్,అప్పలరాజు,నాయకులు కార్యకర్తలు, మహిళాలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.