BREAKING
క్షయవ్యాధి నియంత్రణకు మెరుగైన వైద్యసేవలు కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయండి టీడీపీలోకి నాగిరెడ్డిపల్లె గ్రామ నాయకులు రంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం కోశాధికారిగా దేదీప్య రేవతి ఏకగ్రీవ ఎన్నిక జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య ఎల్లంపేటలో భవన నిర్మాణంపై ఆరోపణలు.. అధికారుల తనిఖీలు ఎప్పుడు..? ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..-తహసీల్దార్ శ్రీకాంత్ బయ్యప్పగారిపల్లిలో ఎన్నికల సందడి.. ప్రజల్లోకి ఎంపీటీసీ అభ్యర్థి అవినీతిని తరిమి కొట్టండి.. అభివృద్ధికి ఓటేయండి రాపూరు బీజేపీలో అసమ్మతి సెగ.. మండల నాయకుల పార్టీ పదవులకు రాజీనామా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా కోడలు ఉపాసన.. తాతగారితో కలిసి ప్రత్యేక పూజలు వారం రోజుల్లో సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి : అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి 15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం

కలెక్టర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.... *మూడు చెక్‌పోస్టుల మీదుగా డ్రైవర్‌ను వెంటాడిన సిబ్బంది *

Select Suryaa Now
కలెక్టర్‌కు  తృటిలో తప్పిన పెను ప్రమాదం.... *మూడు చెక్‌పోస్టుల మీదుగా డ్రైవర్‌ను వెంటాడిన సిబ్బంది *

విజయనగరం బ్యూరో, సూర్య : నిన్నటి వరకు విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ నిర్వహణ...  మరోవైపు ముంచుకొస్తున్న అర్నాబ్ తుఫాను.....ఇంకోవైపు   స్థానిక ఎన్నికల హడావుడి..... ఇలా మూడు కీలక బాధ్యతల తో విశ్రాంతి లేకుండా క్షేత్రస్థాయిలో తిరుగుతున్న జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డికి బుధవారం తిరుగు ప్రయాణంలో తృటిలో  పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. తుఫాను ప్రభావంతో పెద్దగడ్డ నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కలెక్టర్ పారాది వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పనులు ముగించుకుని విజయనగరం వస్తుండగా భూషాయవలస పెట్రోల్ బంక్ సమీపంలో బంక్ వైపు నుంచి ఎదురుగా దూసుకొచ్చిన లారీ కలెక్టర్ కారును ఢీకొట్టింది. ఈ ధాటికి కారు ఎడమవైపు భాగం పూర్తిగా నుజ్జయింది. కారులో కలెక్టర్‌తో పాటు డ్రైవర్ కృష్ణ, సీసీ దుర్గాప్రసాద్, గన్‌మెన్ రాము, దఫేదార్ రమేష్, సమాచార శాఖ వీడియోగ్రాఫర్ సన్యాసినాయుడు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.


సినిమా తరహా ఛేజింగ్
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారయ్యాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని వెంబడించారు. రామభద్రపురం, కొట్టక్కి చెక్‌పోస్టుల వద్ద కూడా ఆగకుండా దూసుకెళ్లిన డ్రైవర్, చివరకు పీకోనవలస చెక్‌పోస్టు సమీపంలో లారీని వదిలేసి పారిపోయాడు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.