BREAKING
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్ టెక్ షేర్ల జోరుతో లాభాల్లో సూచీలు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ

15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు పట్టణంలోని 15వ వార్డులో బుధవారం రాత్రి కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ప్రచార రథంపై నాయకులు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిశారు.  మున్సిపల్ చైర్‌పర్సన్‌ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు, యువ నాయకుడు బొమ్మిరెడ్డి తారక్‌నాథ్ రెడ్డి, 15వ వార్డు టీడీపీ అభ్యర్థి మొహిబుల్లా, నాయకుడు బషీర్, తెలుగు మహిళ నాయకురాలు చండ్రపాటి మంగమ్మ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాయకులకు స్వాగతం పలికారు.  ప్రచారంలో భాగంగా బొమ్మిరెడ్డి తారక్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ షకీలా, 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మొహిబుల్లాకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో 15వ వార్డులో ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది.