ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ
ఆమనగల్లు రంగారెడ్డి:
పట్టణంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మెప్మా ఆధ్వర్యం లో ఏకరూప దుస్తులను బుధవారం ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలకు ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందించే ప్రోసాకాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ జగన్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ మాధవరావు, మేనేజర్ ఆంజనేయులు, ఆర్పీలు పద్మ, విజయలక్ష్మి, చంద్రకళ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.