BREAKING
నిహారిక కొణిదెల నిర్మాణంలో నయా మూవీ: ఆసక్తికరంగా 'పాకెట్ రాకెట్స్' టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి* గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి నీళ్లు..కరెంటు లేక రైతులు ఆగం - ఎండిన పొలంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్ *106 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం 31వ వార్డు అభ్యర్థిని గెలిపించండి... మాండ్ర ఫోక్సో చట్టం పై విద్యార్థులకు అవగాహన ఆ విషయంలో నేను మరింత అప్రమత్తంగా ఉండాల్సిందంటూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు ఐటిపాములలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం రామడుగును కరువు మండలంగా ప్రకటించాలి. పలు తీర గ్రామాల్లో పర్యటించిన ఎంపీ హరీష్… రైతులను రారాజులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటీటీలోకి వచ్చేసిన మరో మైండ్ బ్లోయింగ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్: ఏకంగా నాలుగు ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ మానవత్వం చాటిన పంచాయతీ కార్యదర్శులు *ప్రమాదంలో మృతి చెందిన అంజన్న కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.38 కోట్లు

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా

Select Suryaa Now
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా


ఆత్మకూర్, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కూటమి ప్రభుత్వ సత్తా చాటుదామని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే బుడ్డా ప్రారంభించారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచార ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకు జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు పుష్పగుచ్చాలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు వెంకటాపురం గ్రామ ప్రజల ఆదరణతో కూటమి అభ్యర్థుల సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లోనే అభివృద్ధి అంటే చెప్పడం కాదు చేసి చూపించామని అన్నారు. అభివృద్ధిని ఆశిస్తే కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. 120 కోట్ల రూపాయలతో సిద్దాపురం చెరువు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేశామన్నారు. 70 కోట్ల నిధులతో ప్రత్యేకత ఏర్పాటు చేసి మరో ఐదు గ్రామాలకు సాగునీరు అందిస్తామని రైతులు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి  పెద్ద పీట వేసిందని అన్నారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేసి డ్రైనేజీలు నిర్మించి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్కరు చదువుకు దూరం కాకూడదని ఇంటిలో ఉన్న పిల్లలందరికి తల్లికి వందనం పథకం ద్వారా 15 వేల రూపాయలు అందించామని అన్నారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించడంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో గ్రామాలు అధోగతి పాలయ్యాయని మళ్లీ వారికి అవకాశం ఇస్తే గ్రామాలను నష్టపుచ్చుకున్న వారమైతామని ప్రజలే నష్టపోతారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.