telangana
రామడుగును కరువు మండలంగా ప్రకటించాలి.
సూర్య రామడుగు ;;భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కనుమల్ల గణపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన మండలాలలో రామడుగు మండలం లేకపోవడం దురదృష్టకరం అని అన్నారు.కరీంనగర్ జిల్లాలో అతి తక్కువ వర్ష శాతం రామడుగు మండలంలోనే ఉందని మరి ఇక్కడి అధికారులు ప్రజాప్రతినిధులుఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే కరువు మండలలో రామడుగు మండలన్నీ వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి,జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్,మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్,గుంట అశోక్,మండల ఉపాధ్యక్షులు మాదం శివ,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బద్ధం లక్ష్మారెడ్డి,ఉప సర్పంచ్ లు వేముండ్ల కుమార్,సందపలుకల మహేందర్,యువ మోర్చా నాయకులు బండారి శ్రీనివాస్, ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యవర్గ సభ్యులు వేముల రమేష్,ఐటీసెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, నాయకులు పురేళ్ల రాజశేఖర్, వడ్లూరి రాజేందర్,బూత్ అధ్యక్షులు మడికంటి శేఖర్,దైవల తిరుపతి, గోపు అనంత రెడ్డి,వేముల శ్రీనివాస్, బుర్ర శ్రీధర్,ఎగుర్ల ఎల్లయ్య, నాయకులు ఉత్తేమ్ సాయి,కారుపకల నరేష్,బద్ధం జైపాల్ రెడ్డి,బైర అనిల్,సాయిల్లా రాకేష్, అనుపురం శ్రీ చరణ్, గుర్రం రంజిత్, చితాల అజయ్ తదితరులు పాల్గొన్నారు.