BREAKING
కొటియా మనది, మనమే రక్షించుకుందాం పలు తీర గ్రామాల్లో పర్యటించిన ఎంపీ హరీష్… ఎంపీటీసీ అభ్యర్థి సాసుబల్లి మౌనికను గెలిపించండి *జోరు గాలి వానలోనూ ఇంటింటా ప్రచారం చేసిన టిడిపి పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి కంకణపల్లి అనురాధ. బొప్పాయితో కేవలం జీర్ణక్రియే కాదు.. గుండెకూ ఎంతో మేలు, కానీ వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి! వరద ఉధృతిపై ఎస్పీ తుహిన్ సిన్హా క్షేత్రస్థాయి పర్యటన! మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే ఈ సులభమైన చిట్కాలు పాటించండి! ముందస్తు చర్యలు – ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణమే లక్ష్యం... మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అనకాపల్లిలో కార్పొరేట్ ఎన్నికలకు సర్వం సిద్ధం. తుపాను దెబ్బకు అప్రమత్తమైన అనకాపల్లి రూరల్ పోలీసులు. పెన్షన్ పంపిణీలో అధికార పార్టీ జోక్యం నివారించాలి భోజనం చేసిన వెంటనే స్నానం చేయవచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? సరళ మైసమ్మ దేవాలయ వివాదంపై సంయుక్త విచారణ భారీ వర్షాలతో ఏలేరు కాలువకు పెరిగిన వరద హోరు గాలిలో.. జోరు వానలో... తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత సుడిగాలి పర్యటన

ఐటిపాములలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Select Suryaa Now
ఐటిపాములలో  పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం

 

కట్టంగూరు మేజర్ న్యూస్

నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలం ఐటి పాముల  గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  వేముల వీరేశం  ప్రారంభించారు. గ్రామంలోని శ్రీనాథ్ కాటన్ ఫైబర్ మిల్లులో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం ద్వారా పత్తి రైతులకు కొనుగోలు సేవలు అందుబాటులోకి వచ్చాయి.

వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు పత్తి విక్రయాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరం. పత్తి పంటను విక్రయించేందుకు రైతులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, స్థానికంగా కొనుగోలు కేంద్రం అందుబాటులో ఉండటం వల్ల రవాణా భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటిపాముల గ్రామంలోని శ్రీనాథ్ కాటన్ ఫైబర్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పత్తి రైతులు కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకువచ్చే సమయంలో సంబంధిత నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు, సిబ్బంది సహకరించాలని రైతులు ఆశిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కట్టంగూరు తహసీల్దార్ పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మన్ గుప్త మంజుల మాధవరెడ్డి, కట్టంగూరు మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెద్ద సుక్కయ్య,  గద్దపాటి దానయ్య ,మిట్టపల్లి శివకుమార్, రెడ్డిపల్లి స్వామి, బెజవాడ సైదులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.