విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులకు డిక్లరేషన్ పత్రాల అందజేత
ప్యాపిలి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:ప్యాపిలి మండలంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి సోమశివారెడ్డి చేతుల మీదుగా గెలుపు ధ్రువీకరణ (డిక్లరేషన్) పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన అభ్యర్థులకు పలువురు టీడీపీ నాయకులు, అధికారులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.
డిక్లరేషన్ పత్రాలు అందుకున్న విజేతలు:
కలచట్ల (ఎంపీపీ అభ్యర్థి): తమ్మినేని రాజశేఖర్ నాయుడు
ప్యాపిలి-2: గడ్డం అంకిరెడ్డి
గుడిపాడు: సువర్ణ
హుసేనాపురం: సంజమ్మ
జలదుర్గం-1: జామిలాబీ
ఎన్. రంగాపురం: సాంబశివుడు
ప్యాపిలి-4: తొప్పేల రేణుక
పోతుదొడ్డి: ముచ్చు రామాంజినేయులు
బొంచెర్వు పల్లి: మేకల విజయలక్ష్మి
పెద్దపూదెళ్ల: రమాదేవి
వెంగలాంపల్లి: మోపూరి అపర్ణ
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రాజా నారాయణమూర్తి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, ఖాజా పీరా, తొప్పల శ్రీనివాసులు, కొంగనపల్లి మధు, నడిగడ్డ నాగేంద్ర, తమ్మినేని బాలనరసింహులు, బొంచెర్వు పల్లి కాంతారావు, జయగోపాల్, దామోదర, శేఖర్ తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారుల తరఫున ఎంపీడీవో శ్రీనివాసులు, పంచాయతీ ఏవో నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. సూర్య ప్రతినిధి సుధాకర్ రెడ్డి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం