ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పొడిగించింది. గురువారం (ఈనెల 29)తో ముగిసి గడువును మళ్లీ అధికారులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా వచ్చేనెల 10వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో నవంబర్ 17వరకు తుదిగడువుగా నిర్ణయించారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్