శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ విజయ్ దంపతులు
మాకవరపాలెం, అక్టోబర్ 29,మేజర్ న్యూస్:
మాకవరపాలెం మండలం శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం గ్రామ దేవత శ్రీ పోలమాంబ అమ్మవారిని ఎంపీ చింతకాయల విజయ్ దంపతులు దర్శించుకున్నారు. వారితో పాటు నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి, మాకవరపాలెం మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అల్లు రామనాయుడు, గ్రామ పెద్దలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.