BREAKING
కొలరాడోలో ప్రొ-ఇజ్రాయెల్ ర్యాలీపై ఫైర్‌బాంబు దాడి నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు! అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం

మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి

Select Suryaa Now
మీ బిడ్డ గా  ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి

తిరుపతి, మేజర్ న్యూస్ :
మీ ఇంటి ఆడుపడుచు గా, ఒక బిడ్డగా 23వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ గా ఒక అవకాశం ఇచ్చి గెలిపించండి.. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని 23వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి మన్నూరు అమృతలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం 40 దశాబ్దాలుగా తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తన తాత స్వర్గీయ మన్నూరు వెంకటరమణ  ఎమ్మెల్యేగా తుడా చైర్మన్ గా తిరుపతి వాసులకు ఎంతో సేవ చేశారని, అలాగే తన అవ్వ సుగుణమ్మ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు తిరుపతి వాసులకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన తండ్రి మన్నూరు జయకుమార్ తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ గా 10 సంవత్సరాల పాటు బ్యాంకు కస్టమర్లకు సేవలందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రుణాలను ఇప్పించి ఆదుకున్నారు. 
ఈ నేపథ్యంలో 23వ డివిజన్ కార్పొరేటర్ గా మన్నూరు కుటుంబానికి చెందిన కుమార్ కుమార్తె అమృతలక్ష్మి విద్యావంతురాలు కావడంతో కార్పొరేటర్ గా ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇప్పటికే డివిజన్లోని అన్ని ప్రాంతాలను మూడు పర్యాయాలు కలిగి ఓటర్ల మదిలో అమృత లక్ష్మికి ఓట్లు వేసి గెలిపించాలని నిర్ణయించుకున్నారు. అమృత లక్ష్మి యువకురాలు కావడంతోపాటు స్వతహాగా డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ మన్నూరు కుటుంబానికి సుపరిచితులే. తన డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తనను గెలిపించిన వెంటనే ఆరు నెలలు లోగా సమస్యలన్నీ పరిష్కరించేందుకు శక్తివంతన లేకుండా కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. అమృతలక్ష్మి తండ్రి మన్నూరు జయకుమార్ మాట్లాడుతూ తన బిడ్డకు ఒక్క అవకాశం ఇచ్చి కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని 
ఓటరులను కోరారు. నవంబర్ ఒకటో తేదీ జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో 23 వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ గా అమృత లక్ష్మి సీరియల్ నెంబర్ 1 పై ఓటేసి గెలిపించాలని జయకుమార్ కోరారు.

Dwaraka, staff reporter 

Cell no 9705347341