నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి:
జిల్లా కలెక్టర్ విజయ విజయకృష్ణ*
అనకాపల్లి అక్టోబర్ 29 మేజర్ న్యూస్
గురువారం ఉదయం నర్సీపట్నం పురపాలక (మున్సిపాలిటీ) ఎన్నికల నిర్వహణ, బూత్‌ల కేటాయింపు మరియు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, మరియు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశిస్తూ
అన్ని వార్డుల్లో సవరించిన తుది ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచాలని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను సూచించారు
ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ (RDO), తహశీల్దార్, మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జారీ: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి.