BREAKING
నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు! అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

Select Suryaa Now
పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

 

మండలవిద్యాశాఖాధికారి కే.నరేష్

నక్కపల్లి:మేజర్ న్యూస్:అక్టోబరు 29:గత మూడురోజులుగా  మన ప్రాంతాన్ని వణికించిన ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం నేటితో తొలగిపోవడంతో నేటి నుండి పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న నేపధ్యంలో ఉపాధ్యాయులు  పాఠశాల పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్ధానిక మండల విద్యాశాఖాధికారి కే.నరేష్ తెలిపారు.మూడురోజులుగా కురిసిన వర్షాలు,భారీ గాలులు వీయడంతో  పాఠశాలల పరిసరాలలో అనేకరకముల ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉందని, విద్యార్ధులను తడిచిన గోడలు,శిధిలావస్థలో ఉన్న భవనాలు, గుజ్జుగా ఎదిగిన చెట్లవద్ద సంచరించకుండా తగుజాగ్రత్తలు పాటించాలన్నారు.పాఠశాలలు తెరిచిన వెంటనే నిరంతర తడి వ్యర్ధాలవలన పరిసరాలు తడిచిపోవడంతో విషసర్పాలు సంచరించే ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు ,విష సర్పాలు కనిపిస్తే పూర్తిగా తొలగించిన తరువాతే పిల్లలను కూర్చోబెట్టాలన్నారు.ఎడతెరిపిలేని వర్షాలకు తరగతి గది భవనాల పైకప్పులు,గోడలు పెచ్చులూడి పడే అవకాశం ఉందని అటువంటి గదులకు తాళం వేసి విద్యార్ధులను అక్కడ సంచరించకుండా చూడాలన్నారు.పాఠశాల ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త చెదారం,విరిగిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలన్నారు.పాఠశాల ఆవరణ, కిచెన్ షెడ్ వంటి ప్రాంతాలలో బ్లీచింగ్ జల్లాలని,విద్యార్ధులకు మద్యాహ్నభోజనానికి కావలసిన కాయగూరలను రెండులేదా మూడుసార్లు  శుభ్రమైన నీటితో కడిగి వండి వడ్డించాలన్నారు.ఈ సందర్భంగా ఆయన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులకు సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో ఎం ఈ వో 2 ఆర్.నాగన్నదొర  పాల్గొన్నారు