41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్
తిరుపతి, మేజర్ న్యూస్ :
41 వ డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో ఉండే తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థి షేక్ నసీమున్నిసా ను గెలిపించాలని, అలాగే మేయర్ గా తనను గెలిపించాలని మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఓటర్లను కోరారు. గురువారం 41 డివిజన్ పరిధిలోని తిలక్ రోడ్డు, ఎస్ కే డి నగర్ తదితర ప్రాంతాలలో మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ అభ్యర్థి నసిమున్నీసా, టిడిపి మైనారిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేశారు. జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ మీ అందరికీ అందుబాటులో ఉండే విద్యావంతుడు, మృదుస్వభావి ఎవరికి ఏ సాయం కావాలన్నా పలికే మహబూబ్ బాషా సతీమణి నసీమున్నిసా ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పార్టీలకతీతంగా డివిజన్ పరిధిలో అర్హులైన వారందరికీ పెన్షన్లను ఇప్పించడం సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చడమే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్పొరేటర్ గా నసీంమున్నిసాన్ని గెలిపిస్తే డివిజన్లోని సమస్యలను ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామన్నారు. అనంతరం కార్పొరేటర్ అభ్యర్థి భర్త మహబూబ్ బాషా మాట్లాడుతూ
41వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న తన సతీమణి నసీమున్నీసా ను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. తన సతీమణిని గెలిపిస్తే పార్టీలకు అతీతంగా 41వ డివిజన్లో అర్హులైన వారందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. 41 డివిజన్ పరిధిలోని ఇంటింటికి కార్పొరేటర్ అభ్యర్థి నసీమున్నీసాతోపాటు షేక్ మహబూబ్ బాషా, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. కావున నవంబర్ ఒకటవ తేదీ జరగబోయే 41 డివిజన్ కార్పొరేషన్ ఎన్నికలలో తన సతీమణి నసీమున్నిసాను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ధరణి యాదవ్, 26వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు మోహన్, మీడియా కోఆర్డినేటర్ విజయ్, మోహన్ టిడిపి, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter
Cell no 9705347341