BREAKING
యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ త్రైమాసిక ఫలితాలు అనుభవానికి పట్టం కట్టండి... -60వ డివిజన్ పరిధిలో ఆదం సుధాకర్ రెడ్డి దీపావళి బరిలో సూర్య సరికొత్త చిత్రం.. హ్యాట్రిక్ విజయంపై అభిమానుల భారీ అంచనాలు మాస్టర్ కార్డ్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకెళ్లిన త్రైమాసిక ఫలితాలు! క్రోక్స్ షేర్లు అంచనాలను మించిన త్రైమాసిక ఫలితాలతో దూసుకెళ్తున్న స్టాక్స్! ఆడబిడ్డని ఆదరించండి అమ్మ... -సుభాషిణికి గెలుపుకు డా.పసుపులేటి హరిప్రసాద్ ప్రచారం అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రముఖ కమెడియన్ యోగి బాబు.. మూడు వందలవ సినిమా విడుదల తేదీ ఖరారు ఇన్‌ఫ్రాను సొంతం చేసుకుంటూ అద్దె వసూలు చేస్తున్న వాల్ స్ట్రీట్ దిగ్గజాలు! ఏఐ టెక్నాలజీపై వస్తున్న విమర్శలపై స్పందించిన డైరెక్టర్ సుందర్ సి.. మూకిత్తి అమ్మన్ 2 గ్రాఫిక్స్ పై క్లారిటీ కొలరాడోలో ప్రొ-ఇజ్రాయెల్ ర్యాలీపై ఫైర్‌బాంబు దాడి నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు! అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త

జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి.

Select Suryaa Now
జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి.

 

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్!.

పెద్దేరు నుంచి 6,000 క్యూసెక్కులు విడుదల - వడ్డాది బ్రిడ్జి బంద్.

అనకాపల్లి, అక్టోబర్ 29, మేజర్ న్యూస్: తుఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ ముప్పు నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో (డిపిఓ) ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వర్షాల తీవ్రత, వరద ప్రవాహాల దృష్ట్యా అన్ని సబ్-డివిజన్ అధికారులు (ఎస్డీపివోస్), ఎస్హెచ్ఓలు క్షేత్రస్థాయిలోనే ఉంటూ చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.

రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేత.

పెద్దేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో స్పిల్‌వే ద్వారా 4 గేట్లను ఎత్తి ఇన్-ఫ్లోకు అనుగుణంగా 6,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీని ప్రభావంతో మాడుగుల, బుచ్చయ్యపేట, చోడవరం, అనకాపల్లి టౌన్, అనకాపల్లి రూరల్, కశింకోట, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో వరద ఉధృతి పెరిగింది.

కోణం రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుంచి బొడ్డెరు నదిలోకి 1,500 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు. చీడికాడ, చోడవరం పరిధిలోని నదీ పరీవాహక ప్రాంత ప్రజలు నదిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

క్షేత్రస్థాయిలో రక్షణ చర్యలు - ట్రాఫిక్ మళ్లింపులు: పెద్దేరు వరద నీరు వడ్డాది వంతెనపై ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, బుచ్చయ్యపేట ఎస్ఐ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బారికేడ్లు, తాళ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గొలుగొండ - ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఏజెన్సీ నుంచి భారీ వరద రావడంతో యేటి గౌరమ్మపేట గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వర్టు పాక్షికంగా దెబ్బతినడంతో బీబీ పట్నం, ఎంకే పట్నం, కొతులపాలెం గ్రామాల ప్రజలు నర్సీపట్నం వెళ్లేందుకు ఒద్దిప్ప మీదుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తూ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు. జానవరం బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్థాలను జేసీబీ సహాయంతో తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టినట్లు చోడవరం సీఐ అప్పలరాజు తెలిపారు. రహదారులపై ముంపు నివారణ చర్యలు అనగా రహదారులపై వరద నీరు చేరిన చోట్ల ఇరువైపులా ఇసుక బస్తాలు వేసి ముంపును నివారిస్తూ, వాహనాలను అచ్యుతాపురం వైపు మళ్లించినట్లు రాంబిల్లి సీఐ నరసింగరావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజలకు పలు విజ్ఞప్తులు చేశారు. నదులు, వాగులు, వంకలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున ఎవరూ దాటే సాహసం చేయవద్దు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నదీ తీర, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. అత్యవసర సహాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్ లేదా 112 కు కాల్ చేయాలని కోరారు.