BREAKING
నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు! అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

వంశధార కు భారీ వరదలు

Select Suryaa Now
వంశధార కు భారీ వరదలు


*జలదిగ్బందం లో పెనుగోటివాడ,మాతల గ్రామాలు.
*15 తీర ప్రాంతాల గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో ఖరీఫ్ వరి ముంపు.
*ఒడిశా ఆంధ్ర రాకపోకలు బంద్.
*నివగాం -గులుమూరు రహదారిపై సుమారు అర కిలోమీటర్లు పొడవున వరదనీరు.
*రాకపోకలు పై కొత్తూరు పోలీసులు పటిష్ట చర్యలు.
కొత్తూరు అక్టోబర్ 29(మేజర్ న్యూస్) బంగాళాఖాతం లో ఏర్పడిన ఆర్నాబ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార నదికి భారీ వరదలు వచ్చాయి.గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నదిలో 76వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తుంది.నివగాం -గులుమూరు రహదారి పై సుమారు అర కిలోమీటరు పొడవున వరద నీరు ప్రవహించడం తో ఆకులతంపర 
మదనాపురం,సోమరాజపురం,అంగూరు గ్రామాలకు నివగాం తో తత్సంబంధాలు నిలిచిపోయాయి.మాతల -నివగాం ఆర్ అండ్ బి రహదారి పై సుమారు మూడు,నాలుగు అడుగులు నీరు వరద నీరు ప్రవహించడం తో ఆంధ్రా తో ఒడిశా కు రాకపోకలు నిలిచి పోవడం ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెనుగోటి వాడ గ్రామం చుట్టూ వరదనీరు ప్రవహించడం తో బాహ్య ప్రపంచం తో తత్సంభాంధాలు తెగిపోయాయి. సిర్సువాడ ,కుంటిభద్ర,వసప,నివగాం,మాతల ,మదనాపురం ,ఆకులతంపర , మాకవరం ,పొనుటూరు ,కుద్దిగాం ,కడుము,హంస, వీరానారాయణ పురం,గ్రామాల్లో సుమారు మూడునుండి ఐదు వేల ఎకరాల్లో ఖరీఫ్ వరి ,అరటి ,చెరకు,కూరగాయ పంటలు నీట మునిగి పోయాయి. నివగాం -మాతల గ్రామాల మధ్య భారీ వరద నీరు ప్రవహించడం తో ఎటువంటి అవానంచనీయ సంఘటనలు జరగకుండా కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతాడ ప్రసాదరావు ,సబ్ ఇనెస్పెక్టర్ వెంకటేష్ రాకపోకలను పర్యవేక్షించారు.
సాయంత్రం అరునుండి గంటలు నుండి రాకపోకలను యస్ ఐ వెంకటేష్ నిలిపివేశారు. టెక్కలి ఆర్డీఓ యం వెంకటేశ్వరరావు , డి యస్ పి దాసరి లక్ష్మణ రావు వరద ప్రాంతాలను సందర్శించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంట పొలాలు నీట మునిగాయని,నీరు తగ్గిన తర్వాత నష్టాలను అంచనా వేయడం జరుగుతుందని ఆర్ డి ఓ వెల్లడించారు. ముందస్తు చర్యలు భాగంగా యస్ డి ఆర్ యఫ్ దళాలను రప్పించారు.ఈ దళాలు వరద ప్రాంతాలను పర్యవేక్షించారు.వరద పరిస్థితులను తహసీల్దార్ పి సరోజిని, ప్రత్యేక అధికారి అన్నాదొర,సమీక్షించి ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతధికారులకు సమాచారం తెలియ జేస్తున్నారు.