BREAKING
నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు! అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట..

Select Suryaa Now
శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట..


- నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలుస్తాం
- కోతకు గురైన తీరాన్ని, నీటమునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే గొండు శంకర్.

శ్రీకాకుళం అక్టోబర్ 29 మేజర్ న్యూస్  :
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం శ్రీకాకుళం శాసనసభ్యులు  గొండు శంకర్  విస్తృతంగా పర్యటించారు. సముద్రం కోతకు గురవుతున్న పి.జి.పేట తీరప్రాంతంతో పాటుగా, ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగిన కిల్లిపాలెం, వాడాడ పంచాయతీల పరిధిలోని పంట పొలాలను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, తక్షణ సహాయక చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పి.జి.పేట తీరంలో సముద్రం కోతకు గురవుతున్న తీరును నిశితంగా పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్... తీర పరిరక్షణకు పటిష్టమైన, శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతంలో తీర రక్షణ కోసం నిర్మించిన రాతి కట్టడం వల్ల ఇప్పటికే గ్రామానికి చాలావరకు రక్షణ లభించిందని ఆయన గుర్తుచేశారు. ఈ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా.. ప్రస్తుతం ఉన్న 'ఎల్ (L)' ఆకారపు గ్రోయిన్‌ను మరో 50 మీటర్ల మేర పొడిగించడంతో పాటు, దానికి సరిగ్గా సమాంతరంగా ఇంకొక గ్రోయిన్‌ను నిర్మించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంజూరైన రూ.50 లక్షల నిధులతో పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇదే క్రమంలో అక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన బీచ్‌ను స్థానికులకు, పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా, అందరికీ అందుబాటులో ఉండేలా సుందరంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఈ పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా, మరింత పటిష్టంగా తీర రక్షణ చర్యలు చేపట్టేలా సంబంధిత ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులతో అక్కడికక్కడే చర్చించి తగిన మార్పులు చేర్పులు సూచించారు.
అనంతరం కిల్లిపాలెం, వాడాడ పంచాయతీల పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే గొండు శంకర్ , ముంపునకు గురైన వరి (ఓడి) పంట పొలాల్లోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. చేతికొచ్చే దశలో పంట నీటిపాలవ్వడంతో ఆందోళన చెందుతున్న రైతులను ఆయన ఓదార్చారు. ప్రకృతి కన్నెర్ర చేసినా అన్నదాతలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వెంటనే వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి, ముంపునకు గురైన పంట నష్టాన్ని అత్యంత పారదర్శకంగా అంచనా వేయాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చూస్తామని, నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తక్షణమే చేపడతామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.