BREAKING
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పశ్చిమ గోదావరిలో ఏరియల్ సర్వే, నష్ట తీవ్రత పరిశీలన! నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ.. శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు! రిషికేశ్‌లో కాంగ్రెస్ న్యాయ యాత్ర హోరు.. నటరాజ్ చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు భారీ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన గళం! ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు వాస్కో సండే మార్కెట్ అగ్నిప్రమాదంపై గోవా సీఎం సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలకు ఆదేశం! సీఏక్యూఎమ్ ‘పవన్’ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన: వాయు నాణ్యత చర్యలపై కేంద్రం ఫోకస్ వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పంజా.. వేర్వేరు దాడుల్లో ఐదుగురు పోలీసుల దుర్మరణం, భద్రతా బలగాల తీవ్ర గాలింపు చర్యలు! జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 మిషన్ ప్రయోగం: మరింత బలోపేతం కానున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం

మీ బిడ్డగా ఆదరించి... గెలిపించండి 32వ డివిజన్ లోని సమస్యలన్నిటిని 6 నెలల్లోగా పరిష్కరిస్తాం... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకట కీర్తి...

Select Suryaa Now
మీ బిడ్డగా ఆదరించి... గెలిపించండి   32వ డివిజన్ లోని  సమస్యలన్నిటిని 6 నెలల్లోగా పరిష్కరిస్తాం...  టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకట కీర్తి...

తిరుపతి, మేజర్ న్యూస్ :
32 వ డివిజన్ పరిధిలోని ఓటర్లు బట్టే వెంకట కీర్తి అనే తనను మీ బిడ్డగా మీ సోదరిగా మీ ఇంటి ఆడపడుచు గా భావించి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. గురువారం తన అమ్మమ్మ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి గిరిపురం, ఎస్ డి లేఅవుట్  పరిసర ప్రాంతాలలో ఇంటింటా ప్రచారం చేశారు. మా తాత, అమ్మమ్మ లకు రాజకీయ భవిష్యత్తు నుంచి గుర్తింపును తీసుకొచ్చినది 32 వ డివిజన్ ప్రజలేనని గుర్తు చేశారు. నవంబర్ ఒకటో తేదీ జరగబోయే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో తనను 32వ డివిజన్ కార్పొరేటర్ గా మీరంతా ఆలోచించి తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపించిన వెంటనే డివిజన్లోని సమస్యలన్నిటిని ఆరు నెలల లోపు పరిష్కరించే దిశగా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తన పట్ల చూపిన ఆదరాభిమానాలను తన మనవరాలు బట్టే వెంకట కీర్తిపై చూపించి కార్పొరేటర్ గా గెలిపించాలని వారు కోరారు. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తమ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆత్మీయంగా కలిసి సీరియల్ నెంబర్ 1 సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు . ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి  పార్టీ నాయకులు,  కార్యకర్తలు,  ప్రచారం నిర్వహించారు.

H. Dwaraka, staff reporter 

Cell no 9705347341