ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..!
పగిడ్యాల మేజర్ న్యూస్-: పగిడ్యాల మండలంలోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి సొంత గ్రామాల్లో ఇద్దరు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత ముచ్చుమర్రి ఎంపీటీసీ గా చల్లా. పరమేశ్వరరెడ్డి, కొత్త ముచ్చుమర్రి ఎంపీటీసీ గా ఎస్. ఉసెనయ్య లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బుధవారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి ఘనంగా సన్మానం చేసి అభినందించారు. విజయం సాధించిన ఇద్దరు ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.